పుట్టా శైలజకు పోలీసుల నోటీసులు*

0
TMedia (Telugu News) :

పుట్టా శైలజకు పోలీసుల నోటీసులు*

టీ-మీడియా/హైదరాబాద్(మే-9):

s s consultancy

*విచారణ కు హాజరు కావాలని ఆదేశాలు

తెలంగాణా రాష్ట్రం లో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు హత్య కేసులో పుట్టా మధు ని ప్రశ్నిస్తున్న పోలీసులు తాజాగా మంథని మాజీ ఎమ్మెల్యే , పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్టా శైలజకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. హైకోర్టు లాయర్ వామన్ రావు హత్యకేసులో శైలజను విచారణకు హాజరు కావాలని కోరడంతో ఆమె ఆదివారం రామగుండం కమిషనరేట్ పోలీసులు ఎదటు హాజరయినట్లు తెలుస్తోంది.
మరోవైపు పుట్టా మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. ఏపీలోని భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు.
ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్‌ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు.మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న పుట్టా మధు విచారణ కొనసాగుతోంది. లాయర్ హత్యకు ముందు రూ. 2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. కానీ వామనరావు హత్య కు సంబంధించిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా కేవలం రాజకీయంగా కక్ష సాదించేందుకు తనను ఇరికిస్తున్నారని మధు వాపోతున్నట్లు సమాచారం.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.