అభివృద్దికి ఆమడ దూరంలో షాద్ నగర్ మున్సిపాలిటీ

షాద్ నగర్ మున్సిపాలిటి

0
TMedia (Telugu News) :

ఇళ్ల మధ్యలో ఏరులై పారుతున్న మురుగు నీరు అస్తవ్యస్తంగా రోడ్లు

పందులకు పాములకు స్విమ్మింగ్ ఫూల్ గా మారినా మురుగునీరు

ఇంటి పన్నుల పై గృహ నిర్మాణాల అనుమతుల పై ఉన్న శ్రద్ధా ప్రజా సమస్యలపై లేదా అంటూ ప్రజల ఆగ్రహ జ్వాలలు

కనీస వసతులు కల్పించడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు

Also Read:ఆయుష్ సేవలు అభినందనీయం

s s consultancy

భాగ్యనగరానికి కూతవేట దూరం లో ఉన్న రంగారెడ్డి జిల్లా జి. హెచ్.యం. సి. పరిధిలోని షాద్ నగర్ మున్సిపాలిటీ లోని పలు కాలనీల ప్రజలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇరవై ఏళ్ళ గడుస్తున్నా పట్టణంలోని ఏడవ వార్డులో దాదాపుగా పదిహేడు కాలనీ లు వెయ్యికి పై గా గృహాలు కలవు పదిహేను వేల జనాభా గల వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవని ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి లేదని డ్రైనేజీలు లేక మురుగునీరు ఇళ్ల ముందు చేరి పందులకు ఆవాసం గా మారి ఈగలతో ధోమలతో రకరకాల రోగాలతో అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం డ్రైనేజీలు లేక ఇళ్ల మధ్యలో చెరువులను తలపించేలా మురుగు నీరు చేరి అందులో పందులు చేరి తీవ్ర దుర్వాసనను వేద జల్లుతున్నాయి.

Also Read:కృష్ణా, గోదావరి జలాల పై కేంద్ర పెత్తనం అత్యంత ప్రమాదకరము

పాములు పందులకు స్విమ్మింగ్ ఫుల్ గా మారాయని వర్షం కురిస్తే చాలు ఇళ్ళలో నుండి బయటికి రాలేని పరిస్థితి అస్తవ్యస్తంగా మరీనా రోడ్ల పై నుండి ద్విచక్ర వాహనాలు, కార్లుకూడా రాలేని పరిస్థితి ఏర్పడింది వర్షం కురిస్తే వర్షపునీరు మా ఇళ్ల మధ్యలో చెరువుల మారుతున్న మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వారికి ఇళ్ల టాక్స్ లు ఇంటి పర్మిషన్ ల పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పై ఉండదా మాకు కనీస సౌకర్యాలు కల్పించలేని మున్సిపాలిటీ అధికారులు ఎం మొహం పెట్టుకొని టాక్స్ లు అడుగుతారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కౌన్సిలర్ కు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని 17 వ వార్డు ప్రజలు తమ ఆవేదన వ్యక్తంచేశారు తాము టాక్స్ కడుతున్నాం దేనికని కనీస సౌకర్యాలు కల్పించలేని మున్సిపాలిటీ అధికారులు ఇళ్ల టాక్స్ ప్రజల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రోజు రోజుకు భాగ్య నగరానికి చేరువ అవుతున్న షాద్ నగర్ మున్సిపాలిటీ లో అధికారుల నిర్లక్ష్యంతో నిధులున్న ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని కేవలం అక్కడక్కడ కొన్ని కాలనీ లను పై పై మెరుగులు దిద్దుతూ గొప్పలు చెప్పు కోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొస్తారని తరువాత వారి సమస్యలు పట్టవని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ కాలని లోని సమస్యలు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఏదీ ఏమైనా మున్సిపాలిటీ అధికారులు కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ పట్టణ ప్రజల సమస్యల పై లేదని నిపట్టణంలో ఎక్కడ కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టిన మున్సిపాలిటీ అధికారులు డేగళ్ల వాలిపోయి అధిలేదు ఇదిలేదు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నరని పలు విమర్శలు సైతం వెలువడుతున్నాయి.

Also Read:చెరువుకట్టను పరిశీలించిన అఖిలపక్షం

కేవలం 17 వార్డు మాత్రమే కాదు పట్టణంలో దాదాపు అన్ని కాలనీల్లో ఎదో ఒక సమస్య రోడ్లు లేక బురదగా మారుతూ వర్షం కురిస్తే బైటికి వెళ్ళ లేని పరిస్థితి అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది షాద్ నగర్ మున్సిపాలిటీ నిధులు లేకన లేక అధికారుల నిర్లక్ష్యమా వారికే తెలియాలి అభివృద్ధి పథంలో నియోజక వర్గాన్ని ముందుకు తీసుకు పోవలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న స్ధానిక ఎమ్మెల్యే గారి ఆశయానికి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటు పడుతుందా లేక నిధులు లేక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా వారికే తెలియాలి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది అధికారులు మరీనా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది షాద్ నగర్ మున్సిపాలిటీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తార లేక తమకు పట్టదనే నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తారా వేచి చూడాల్సిందే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.