ఈటల స్థానంలో మరొకరు ఫిక్స్! మరో మంత్రిపైనా కేసీఆర్ వేటు?

0
TMedia (Telugu News) :

ఈటల స్థానంలో మరొకరు ఫిక్స్! మరో మంత్రిపైనా కేసీఆర్ వేటు?
టి-మీడియా/హైదరాబాద్(మే-13):

s s consultancy

*రెండు మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణకు అవకాశం
*వైద్యశాఖ మళ్లీ ఆయన వద్దకేనంటూ ప్రచారం
*మరో మంత్రిపై వేటుకు సిద్ధం?

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారైనట్లుగా కనిపిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లోనే కొత్త మంత్రులకు అవకాశం దక్కనున్నట్లుగా గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారు. తాను హెదరాబాద్ వస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడులో లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అయినా తమిళిసై హైదరాబాద్‌కు వస్తున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కోసమే గవర్నర్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఇటీవలే వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ తొలగించారు. ఆ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. రెండు, మూడు రోజులుగా వైద్యశాఖపై సీఎం కేసీఆరే సమీక్షలు నిర్వహించారు. ఆ శాఖ తరపున కేంద్రంతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొంటున్నారు. లాక్ డౌన్ విధింపు ప్రకటన కూడా వైద్య శాఖ మంత్రి లేకుండానే వచ్చింది. రాష్ట్రంలో కోవిడ్ పంజా విసురుతున్న సమయంలో వైద్య శాఖకు మంత్రి లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
కొవిడ్ కల్లోల సమయంలో వైద్యశాఖను సీఎం దగ్గర ఉంచుకోకుండా.. మరొకరి అప్పగిస్తేనే బెటరనే చర్చ టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతుంది. దీంతో సీఎం కేసీఆర్ కూడా వైద్యశాఖకు కొత్త మంత్రిని నియమించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. కొత్త వైద్య శాఖ కోసం చాలా పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కేసీఆర్ తొలి కేబినెట్‌లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డికి రెండోసారి మంత్రి అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఈటల స్థానంలో లక్ష్మారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు వైద్య శాఖను అప్పగించవచ్చనే చర్చ బలంగా జరుగుతోంది.
స్వయంగా వైద్యుడు అయిన లక్ష్మారెడ్డి అయితే బెటరనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారని అంటున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు వైద్య శాఖను అప్పగించవచ్చనే మరో చర్చ కూడా జరుగుతోంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ రావు పాల్గొనడటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
కవిత సహా ఆయనకూ మంత్రి పదవి?
కేబినెట్ విస్తరణ ఉంటే ఈటలతో ఖాళీ అయిన ఒక్క స్థానానికే పరిమితం అవుతారా లేక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. కేబినెట్‌లో భారీగానే మార్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చని భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి మల్లా రెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్‌గా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రిపదవిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.