గీరథ మహర్షిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్ కృష్ణ భాస్కర్

0
TMedia (Telugu News) :

గీరథ మహర్షిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్ కృష్ణ భాస్కర్

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,(మే 19):

s s consultancy

భగీరథ మహర్షి సహనానికి ప్రతిరూపమని, తాము నిర్దేశించుకున్న లక్ష్యసాధన కొరకు ప్రజలందరూ, ముఖ్యంగా యువత భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

బుధవారం కలెక్టరేట్ లో మహర్షి భగీరథ జయంతి వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి లు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ గెలుపు కోసం చాలా మంది తహతహలాడుతుంటారని, గెలుపు దరి చేరాలంటే ఓర్పు ఎంతో అవసరమన్నారు. భగీరథ మహర్షి చేసిన కఠోర యజ్ఞంతో తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారని గుర్తు చేశారు. ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథుడితో పోలుస్తారని, భగీరథ మహర్షిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.