సింగరేణి ఆస్పత్రులు స్వాధీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

0
TMedia (Telugu News) :

సింగరేణి ఆస్పత్రులు స్వాధీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

s s consultancy

టీ మీడియా మందమర్రి, మంచిర్యాల జిల్లా :

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి చెందిన రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిన్ని స్వాధీన పరుచుకొనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మందమర్రి పట్టణంలోని ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, బెల్లంపల్లి రీజియన్లో 17 వేల కార్మికులు, విశ్రాంతి కార్మికులు వారి కుటుంబాలు సుమారు 80 వేల మందికి సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ రెండు ఏరియా ఆస్పత్రుల ద్వారా వైద్య చికిత్స అందిస్తుందని, గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ లో రాష్ట్ర ప్రభుత్వం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిని స్వాధీనపరచుకొని కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నది. దీంతో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి వెళ్లే సింగరేణి కార్మికులను రామకృష్ణాపూర్, గోదావరిఖని ఏరియా హాస్పిటల్ పంపిస్తున్నారని, ప్రస్తుతం ప్రభుత్వం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిని సైతం స్వాధీనపరచుకుంటే కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్య దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. బెల్లంపల్లి రీజియన్లో గని ప్రమాదం జరిగిన, ప్రస్తుతి వైద్యం, కార్మికులకు, విశ్రాంత కార్మికులకు, వారి కుటుంబాలకు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం, మందులు కావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే మూతబడిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, క్లబ్ ను, దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీన పరుచుకొని ప్రజలకు కోవిడ్ చికిత్సకు వినియోగించుకోవాలని సూచించారు. కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు వైద్య సేవలు అందించే రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం ఏరియా జిఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమానాథుని సుదర్శన్, కంది శ్రీనివాస్, జగన్, జేట్టి మల్లయ్య, ఐఎన్టియుసి నాయకులు సిద్దంశెట్టి రాజమౌళి, కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, సిఐటియు నాయకులు రామగిరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.