తెలంగామ రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయం – KCR నియంతృత్వ వైఖరి

0
TMedia (Telugu News) :
s s consultancy

తెలంగామ రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయం – KCR నియంతృత్వ వైఖరి

అదిలాబాద్ జిల్లా/బోథ్ :మే(10)తెలంగాణ రాష్ట్రంలో రైతులపై చిన్న చూపు చూస్తున్నారని అప్రకటిత నిర్బంధ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ శ్రీ సోయం బాపురావు గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు, బోథ్ మండల క్షేత్ర పర్యటన సంధర్భంగా బోథ్ దన్నుర్ గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ఈ సందర్బంగా జొన్నలు మద్దతు ధర ప్రకటించడం వల్ల చాలామంది రైతులు యసంగి పంటగా జొన్నలు ఎంచుకున్నారు, గతంలో మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టారన్నారు, ఐతే రైతులు ఈసారి జొన్నలు విస్తారంగా పండించారు. ఖరీఫ్ సమయం దగ్గర పడుతున్నదున ప్రభుత్వం వెంటనే జొన్నలు కొనుగోలు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. వచ్చే రెండురోజుల్లో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. సందర్బంగా ఎంపీ సోయం బాబూరావు గారు పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ బీజేపీ ఎల్లప్పుడూ రైతు పక్షాన ఉంటుఁదన్నారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో మళ్ళీ పోరాటం చేయాల్సివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల నాయకులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.