టెస్టులు ఉదయం 9గంటల లోపు పూర్తి చేయాలి.

0
TMedia (Telugu News) :

కరోనా టెస్టులు ఉదయం 9గంటల లోపు పూర్తి చేయాలి.

సౌకర్యాలు కల్పించాలి;ప్రజా సంఘాలు

s s consultancy

టీ మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా, మే 28.

లక్షేట్టిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం రోజున ప్రజాసంఘాల నాయకులు సందర్శించి కరోనా టెస్టుల కోసం వచ్చే అనుమానితుల సమస్యలను అడిగి తెలుసుకొని అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఫ్లాకార్డులతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ…… జన్నారం,దండేపల్లి,లక్షేట్టిపేట మూడు మండలాలకు పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి లక్షేట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు.ఆసుపత్రికి సరిపడా సిబ్బంది లేకపోవడం తో ఆసుపత్రికి వచ్చే రోగులకు తప్పని ఇబ్బందులు. ప్రదానంగా ప్రతిరోజు నిత్యం కరోనా అనుమానితులు పరీక్షల కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఉదయం 5:30 గంటలకు వస్తున్నారు. ఈ రోజు ఉదయం 6:00 గంటలకు ఒక గర్భిణీ స్రీ కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చింది.చాలా ఇబ్బంది ఆవుతుందని తొందరగా టెస్టులు చేయమని వైద్య అధికారులకు చెప్పిన అధికారులు పట్టించుకోలేదు.
అందరు వచ్చాక,11:30 గంటల సమయానికే పరీక్షలు చేస్తామని చెప్పడంతో ఓపిక లేక కూర్చొని ఉంది.
వైద్య అధికారులు 11:30 గంటలకు కరోనా పరీక్షలు చేయడం తో ఉదయం పూట కరోనా పరీక్షలకు వచ్చే అనుమానితులు దాదాపు 6 గంటలు వేచి చూస్తేనే పరీక్షలు చేస్తున్నారు. కరోనా అనుమానితులకు ఆస్పత్రి వద్ద కనీసం త్సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతిరోజు శానిటైజర్ చేయించాలి. రెండు రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ తో హాస్పిటల్ శుభ్రం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం పెట్టిన లాక్ డౌన్ లో భాగంగా పరీక్షల కోసం వచ్చిన అనుమానితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అని ప్రజాసంఘాలు వారు పేర్కొన్నారు.కరోనా పరీక్షలను ఉదయం 9 గంటల లోపు పూర్తి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కొంతమంది విధులకు రావట్లేదు అని ఆరోపించారు.అప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఆస్పత్రి సూపర్డెంట్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సౌకర్యాలు కల్పించలేదు అన్నారువిధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపర్డెంట్ ను, ఆసుపత్రి అసౌకర్యాల పై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి
దుంపల రంజిత్ కుమార్
డివైఎఫ్ఐ- మండల కో-కన్వినర్ అడ్లూరి హరీష్
కెవిపిఎస్ -జిల్లా ఉపాధ్యక్షులు భైరం లింగన్న
సిపిఐ-జిల్లా నాయకులు అవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.