కలెక్టర్ కార్యాలయం ముందు రైతు దంపతులుపురుగుల మందు డబ్బా తో నిరసన

0
TMedia (Telugu News) :
s s consultancy

కలెక్టర్ కార్యాలయం ముందు రైతు దంపతులుపురుగుల మందు డబ్బా తో నిరసన

ఆదిలాబాద్ జిల్లా:మే(17)ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వృద్ధ జంట పురుగుల మందు డబ్బా తో నిరసన… ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హతనూర్ మండలం లోని కొత్త గూడ గ్రామానికి చెందిన చౌహాన్ రావుజి ,మరియు అతని భార్య తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బా తో నిరసన ప్రదర్శన చేపట్టారు.తమకు వారసత్వం గా వస్తున్న తమ నాలుగున్నర ఎకరాల భూమిని ఎలాంటి సమాచారం లేకుండా 145 ఆక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారని వృద్ధదంపతులు ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటి వరకు ప్రభుత్వ ఉన్నత అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని,ఇక ఈరోజు మాకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి కలెక్టర్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముందు వాపోయారు..దీన్ని గమనించిన పోలీస్ లు ఉన్నతాధికారులతో మాట్లాడించుతాం అని ఆర్.డి.ఓ.దగ్గరకు తీసుకు వెళ్లి వారి సమస్యను ఆర్.డి.ఓ.కు వివరించారు.ఆర్డీవో బజార్హతనూర్ తాసిల్దార్ తో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు శాంతించి వెనుదిరిగి వెళ్లారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.