తెలంగాణలో కోవాగ్జిన్ రెండో డోసు నిలిపివేత

0
TMedia (Telugu News) :

తెలంగాణలో కోవాగ్జిన్ రెండో డోసు నిలిపివేత..
టి-మీడియా/హైదరాబాద్(17:

s s consultancy

*రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత
*కోవాగ్జిన్ రెండో డోసు నిలిపివేసిన ప్రభుత్వం
*కేంద్రం నుంచి రాని వ్యాక్సిన్

రాష్ట్రంలో కోవాగ్జిన్‌ మొత్తంగా ఖాళీ అయిపోవడం, కేంద్రం నుంచి కొత్త స్టాకు రాకపోవడంతో కోవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
వ్యాక్సిన్ల కొర‌త భారత్‌ను వేధిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి నెలకొంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేష‌న్ నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ నిలిపేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం పేర్కొంది. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ ఎప్పుడ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.
ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించినా వ్యాక్సిన్ల కొర‌త‌తో అది పూర్తిస్థాయిలో కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ స‌మ‌యంలో ప్రభుత్వం రెండో డోసు లబ్దిదారులకు ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది. కానీ, ఇప్పుడు వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా రెండో డోసు వ్యాక్సినేష‌న్‌ను కూడా నిలిపివేసింది. కాగా, ఇప్ప‌టికే శ‌ని, ఆదివారాల్లో వ్యాక్సినేష‌న్ నిలిపివేసిన స‌ర్కార్ తాజాగా ఈ ప్ర‌క‌ట‌న చేసింది.
అయితే కోవిషీల్డ్‌ విషయంలో పంపిణీకి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కోవిషీల్డ్‌ రెండో డోసును 84 రోజుల (12 వారాల) తర్వాతే ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి మాత్రం పాత గడువు లెక్కన (8 నుంచి 12 వారాల మధ్య) ఇవ్వొచ్చని రాష్ట్రాలకు సూచించింది. స్లాట్‌ బుక్‌ చేసుకోని వారికి మాత్రం 84 రోజుల గడువు ముగిశాకే ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు కొత్త గడువు ప్రకారం రెండో డోసు తీసుకోవాలని భావిస్తే ఆ మేరకు పోర్టల్‌లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.