కేంద్రానికి రూ. 99,122 కోట్లఆర్బీఐనిధులు

0
TMedia (Telugu News) :

ముంబయి

ఆర్బీఐ: కేంద్రానికి రూ. 99,122 కోట్ల నిధులు

కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌(ఆర్‌బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి.

★ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్‌బీఐ కేంద్రానికి డివిడెంట్‌ రూపంలో చెల్లించనుంది.

★ ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది.

s s consultancy

★ కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

★ కరెన్సీ ట్రేడింగ్‌, బాండ్ల ట్రేడింగ్‌ నుంచి ఆర్‌బీఐ భారీగా ఆదాయం పొందుతుంది.

★ దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది.

★ అలా ఇప్పుడు కూడా రూ. 99,122 కోట్లను పంపించేందుకు నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

★ గతేడాది కరోనా తొలి దశ సమయంలోనూ రిజర్వ్‌ బ్యాంకు డివిడెంట్‌ పంపించింది.

★ అప్పుడు మొత్తం మిగులు ద్రవ్యంలో 44శాతం అంటే రూ. 57వేల కోట్లకు కేంద్రానికి ఇచ్చింది.

★ గత ఏడు సంవత్సరాల్లో ఆర్‌బీఐ ఇచ్చిన అత్యంత తక్కువ డివిడెంట్‌ అదే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.