నిబంధనలను కచ్చితంగా పాటిoచాలి :ఎస్సై ఉపేద్ర చారి

0
TMedia (Telugu News) :

ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిoచాలి :ఎస్సై ఉపేద్ర చారి

కోవిడ్ పాజిటివ్ వచ్చి బయట తిరిగితే కేసులు తప్పవు

s s consultancy

కోవిడ్ లక్షణాలుండి బయట తిరిగితే ఐసోలేషన్ కు తరలిస్తాం

టీ–మీడియా ప్రతినిధి (మే 12)జగిత్యాల జిల్లా :

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రజలంతా పాటించాలని,ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని బుగ్గారం ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. మండలoలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు బయట తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చందని,ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.కరోనా లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తి తగిన వైద్య పరీక్షలు చేసుకొని వైద్యుల సూచనలు,సలహాలు పాటిస్తూ మందులు సేవిస్తూ తగు జాగ్రత్తలతో హోమ్ క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు.ఎవరికైనా తీవ్ర లక్షణాలు ఉంటే ప్రభుత్వ వైద్యుల సూచనలతో ఆసుపత్రిలో చేరాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు గాని,కోవిడ్ లక్షణాలు ఉన్నవారు గానీ అసలే బయట తీరుగరాదని అన్నారు. ఇలాంటి వారు బయట ఎక్కడ ఎవరికి కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు నిబంధనలు పాటించకుంటే తగు చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తామన్నారు.
లాక్ డౌన్ ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపే సామాన్య ప్రజలు (కోవిడ్ సోకనివారు) బయటి పనులు ముగించుకోవాలని సూచించారు.అత్యవసరం మరియు సరైన కారణం ఉంటే తప్ప మిగతా సమయాలలో సామాన్య జనాలు కూడా బయట తిరుగరాదని,లాక్ డౌన్ సమయాలలో బయట తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదని ఎస్సై ఉపేంద్రచారి పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఇంట్లో కూడా మాస్కులు ధరించి తమ ప్రాణాలను తామే కాపాడుకోవాలని ఆయన సూచించారు. మీ ఇంట్లో గానీ, ఇంటిప్రక్క వారికి గానీ, మీ గ్రామస్తులకు గానీ కరోనా లక్షణాలు, దగ్గు, జలుబు, జ్వరం ఇతరత్రా లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక ఆశావర్కర్లకు, అంగన్ వాడీ టీచర్లకు, హెల్త్ అసిస్టెంట్లకు, పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. అలాంటి వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలని ఆయన కోరారు.ఏ కొంచెం కోవిడ్ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని ఎస్సై సూచించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.