అంకితభావంతో పనిచేసే వ్యక్తి నరసింహులు

0
TMedia (Telugu News) :

టి మీడియా వనపర్తి : తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు ని నియమించారు. ఈసందర్బంగా రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద అశోక్ మాట్లాడుతూ పార్టీలో అంకితభావంతో పనిచేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని బక్కని నరసింహులు నియమకంతో రుజువు చేస్తోంది.

s s consultancy

పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా పనిచేస్తూ ఎమ్మెల్యే గా టిడిపి మెంబర్ గా,పని చేసిన నరసింహులు ను నియమించిన చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. బక్కని నాయకత్వం లో పార్టీ ముందుకు సాగడానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నాయకులను కలుపుకోని పార్టీ అభివృద్ధికి బక్కని కృషి చేయాలని కోరారు. ఈసందర్భంగా బక్కని నరసింహులు కు శుభాకాంక్షలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.