హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తాం: కేసీఆర్

0
TMedia (Telugu News) :

టీమీడియా నల్గొండ: కోవిడ్ కారణంగా జిల్లా పర్యటన ఆలస్యమైందని సీఎం కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అన్నారు. సోమవారం ఆయన హలీయాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో హక్కు పట్టాలు ఇస్తామన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.