మున్నూరు కాపులకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం

ముఖ్య నాయకుల సమావేశంలో పలువురు వక్తలు

0
TMedia (Telugu News) :

తెలంగాణా ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తులకు అండగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.సంఘం ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం టిఆర్ ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయ ఇంచార్జీ గుండాల(ఆర్జేసీ)కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు.

Also Read:అభివృద్దికి ఆమడ దూరంలో షాద్ నగర్ మున్సిపాలిటీ

 

s s consultancy

దీనిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో 8 మంది కి కార్పొరేటర్లు గా టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకున్నట్లు తెలిపారు.దీనితో పాటు పలు సమస్యల పరిష్కారానికి టిఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసమే తామున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరుకాపు కులస్తుల కు చేసింది ఏమిలేదన్నారు.

Also Read:అభివృద్దికి ఆమడ దూరంలో షాద్ నగర్ మున్సిపాలిటీ

రాజకీయంగా ఒక్కకాపును కూడా కార్పొరేటర్ చేయలేని వారు కాపుల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఖమ్మంమార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మున్నూరుకాపు సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మడురి సైదారావు లు మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులకు నామినేటెడ్ పోస్టులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు,పార్టీ పదవులు,ఉద్యోగుల బదిలీలు,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.అటువంటి ప్రభుత్వానికి మున్నూరుకాపు కుల బంధువులు భవిష్యత్ లో అండగా ఉండాలని,తద్వారా కులస్తులను మరింత గా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ అభివృద్ధి కి అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, మడు రి ప్రసాద్,చామకురి వెంకన్న,కాపుసంఘం నాయకులు ఉండేలా గౌరీనాధ్,ఎర్రా అప్పారావు,పరమేష్,కనకం భద్రయ్య,గుండ్లపల్లి శేషు,గోరంట్ల రవి,మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.