మునిసిపాలిటీలకు ఆదాయ గండం

0
TMedia (Telugu News) :

టీమీడియా హైదరాబాద్;
భవన నిర్మాణ అనుమతుల మంజూరు బాధ్యత కలెక్టర్లకుమునిసిపల్‌ కమిషనర్ల అధికారానికి కత్తెరఆగస్టు 15 నుంచి అమల్లోకి కొత్తవిధానం!అనుమతుల కోసం చెల్లించే ఫీజులు ఎవరికి చెందుతాయో చెప్పని సర్కారునేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరితే మునిసిపాలిటీల ఆదాయానికి తప్పని గండి మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల అధికారాలకు కత్తెర వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంతో ఆయా సంస్థల ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని మునిసిపల్‌ కమిషనర్ల నుంచి తప్పించి.. జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సర్కారు నిర్ణయించడంతో అనుమతుల కోసం ఫీజు రూపంలో వచ్చే ఆదాయం మునిసిపాలిటీలకు దక్కుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఎ్‌స-బీపాస్‌ చట్టం ప్రకారం ఈ అధికారాలను కలెక్టర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో అనుమతులు శరవేగంగా వస్తాయని అంటోంది. ఆగస్టు 15 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అనుమతులకు సంబంధించి ఫీజు రూపంలో వచ్చే ఆదాయంపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఈ ఫీజు మునిసిపాలిటీలకే చెందుతుందా? లేక నేరుగా ప్రభుత్వానికి వెళుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి మునిసిపాలిటీలకు వచ్చే ఆదాయంలో ఆస్తి పన్ను, వాణిజ్య పన్నుతోపాటు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు కూడా కీలకమైనవి. మొత్తం ఆదాయంలో ఈ ఫీజుల రూపంలోనే 25 శాతం దాకా మునిసిపాలిటీలకు సమకూరుతుంది. దీనితో వాటి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఒకవేళ ఈ ఫీజులను ప్రభుత్వ ఖజానాకు వెళ్లేలా చేస్తే అది మునిసిపాలిటీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

s s consultancy

మునిసిపాలిటీలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థలు, మునిసిపాలిటీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేసేందుకే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పలు అధికారాలను వాటికి కల్పించారు. ఆర్థిక సంఘాలతోపాటు పలు కమిటీలు కూడా ఈ ఆవశ్యకతను వివరించాయి. కానీ, భవన నిర్మాణ అనుమతులను వేగంగా మంజూరు చేసే పేరుతో అందుకు సంబంధించి ఫీజుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఈ ఆదాయాన్ని లాక్కుంటే.. ఈ సంస్థలను బలహీనపరచడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం భూముల విలువలు పెంచిన సందర్భంలో రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో నుంచి స్థానిక సంస్థలకు చెందాల్సి 0.5 శాతాన్ని రద్దు చేసింది. ఇప్పుడు నిర్మాణ అనుమతుల ఆదాయం కూడా రాకుండా పోతే అవి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.

There is concern that municipalities. may have to rely on the government to fund development programs.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.