ప్రభుత్వం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది

0
TMedia (Telugu News) :

తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని నరేంద్ర మోద నేతృత్వంలోని ఎకనామిక్ ఎఫైర్స్ కేబినెట్ కమిటీ 2021-22 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటలను మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నువ్వుల ధర క్వింటాల్‌కు రూ.452 పెంచారు. కంది, మినము ధరను రూ.300, వేరుశనగ 275, కుసుమల ధరను రూ.235 రూపాయలు పెంపొందించారు. జొన్నలు, ఇతర తృణ ధాన్యాల మద్దతు ధరను కూడా పెంచినట్లు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు.మద్దతు ధర పెరిగిన పంటల వివరాలు:

గత ఏడాది సాధారణ రకం వరి ధాన్యం మద్దతు ధర రూ.1868 ఉండగా..ఇప్పుడు 1940 రూపాయలకు పెంచారు. అంటే రూ.72 పెరిగింది. అదే ఏ గ్రేడ్ వరి రకం మద్దతు ధరను రూ.1960కి పెంచారు.

హైబ్రిడ్ జొన్న మద్దతు ధరను రూ.2620 నుంచి రూ.2738 రూపాయలకు పెంచారు. దేశీరకం జొన్నల ధర రూ.2640 నుంచి రూ.2,758కి పెరిగింది.

సజ్జల మద్దతు ధర కూడా పెరిగింది. గత ఏడాది క్వింటాల్ సజ్జల ధర రూ.2150 ఉండగా.. దానిని ఇప్పుడు రూ.2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

s s consultancy

ఇప్పటి వరకు క్వింటాల్ రాగుల మద్దతు ధర రూ.3295 ఉండగా.. దానిని రూ.3377కి పెంచారు. అంటే రూ.82 పెంచారు. మొక్కజొన్న మద్దతు ధరను రూ.1850 నుంచి రూ.1870కి పెంచారు.

కందుల మద్దతు ధర రూ.6000 నుంచి 6,300కు పెరిగింది. పెసర్ల ధర రూ. 7196 నుంచి 7275కి పెంచారు. మినముల ధర రూ.6వేల నుంచి 6,300కి పెంచారు.

వేరుశనగల ధర గతంలో 5275 ఉండగా.. ఇఫ్పుడా ధర రూ.5550కి చేరింది. పొద్దుతిరుగుడు ధర రూ.5,885 ఉండగా.. 6015కి పెంచారు.

ఇక సోయాబీన్ (పసుపు రంగు) ధరను రూ.3880 నుంచి 3950కి పెంచారు. నువ్వుల ధరను రూ.6,885 నుంచి 7307కి పెంచారు. కుసుమల ధర రూ.6930కి చేరింది.

పత్తి (సాధారణ రకం) మద్దతు ధరను రూ.5515 నుంచి రూ.5726కి పెంచారు. పత్తి (పొడవాటి రకం) ధర రూ. 5825 నుంచి రూ.6025కి పెరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.