మాదిగల స్వతంత్ర దినోత్సవం మందకృష్ణ పుట్టినరోజు వేడుకలు

టి మీడియా భద్రాచలం.

0
TMedia (Telugu News) :

భద్రాచలం పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మాదిగల స్వతంత్ర దినోత్సవం, మందకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

also readజగ్జీవన్ రామ్ స్పూర్తితో దళితుల పథకాలు

s s consultancy

ఏ ఎం సి కాలనీ లో గ్రామ గౌరవ అధ్యక్షులు కొక్కెరపాటి వెంకటేశ్వర్లు మాదిగ, జగదీష్ కాలనీ లో గోండ్వానా సంక్షేమ పరిషత్ వ్యవస్థాపకులు సొందే వీరయ్య, భూపతి రావు కాలనీ లో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తోకల దుర్గాప్రసాద్ జెండా ఆవిష్కరించారు.

alsoreadసఖీ-భరోసా కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

అనంతరం జరిగిన కార్యక్రమం ఉద్దేశించి గోండ్వానా సంక్షేమ పరిషత్ వ్యవస్థాపకులు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ మిత్రులు సొందే వీరయ్య మాట్లాడుతూ. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఆవిర్భావం తోనే మాదిగల వాణి, అస్తిత్వం, ఆత్మ గౌరవం తో పాటు హక్కుల సంగ్రామాన్ని ప్రపంచానికి తెలిసేలా మందా కృష్ణ మాదిగ ఉద్యమాన్ని నడిపారని,గడిచిన 26 ఏళ్ల ఉద్యమం మాదిగ సామాజిక వర్గానికి కాకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం మందా కృష్ణ మాది గా నాయకత్వం పోరాటాలు నడిపి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు చేశారన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా, మండల సీనియర్ నాయకుడు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు మాదిగ, మండల అధ్యక్షులు తోకల దుర్గాప్రసాద్ మాదిగ, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.