కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి, టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత నామ భేటీ

ఢిల్లీ

0
TMedia (Telugu News) :

కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టి.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాపై చర్చించారు. జూన్‌, జూలై నెలల్లో రాష్ర్టానికి 93 వేల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయిందని కేంద్రం దృష్టికి తెచ్చారు.

s s consultancy

ALSO READ:చైనా టిక్ టాక్ పై పాకిస్థాన్ నిషేధం

దీన్ని ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో రావాల్సిన 4.5 లక్షల టన్నుల యూరియాతో కలిపి పంపాలని విజ్ఞప్తి చేశారు.  విదేశాల నుంచి వచ్చే యూరియాలోనూ తెలంగాణకు కోటా కేటాయించాలని కోరారు.  దక్షిణాదిలో తొలుత తెలంగాణలోనే నాట్లు పడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా తెలంగాణకు యూరియా ఇవ్వాలని విన్నవించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, యూరియా విషయంలో తెలంగాణకు ఎట్టిపరిస్థితిలోనూ ఇబ్బంది రానివ్వబోమని హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి , ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.