◆ నిరుపేద కుటుంబాలకు ‘ నామ ‘ కొండంత అండ ◆

0
TMedia (Telugu News) :

– సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు

– ఎంపీ నామ గారి క్యాంపు ఆఫీస్ లో 23 మందికి చెక్కుల పంపిణీ

ఖమ్మం : నిరుపేద కుటుంబాలకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గారు కొండంత అండగా నిలుస్తున్నారని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగ భూషణం గారు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎంపీ నామ గారి క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూరాకుల డీసీసీబీ నాగభూషణం గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగభూషణం గారు మాట్లాడుతూ అనార్యోగానికి గురై ఆర్ధికంగా ఇబ్బందుల పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఖమ్మం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. వైద్య ఖర్చుల సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి నామ గారు అండగా నిలుస్తున్నారన్నారు .

s s consultancy

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడంలో ఎంపీ నామ గారు అగ్రస్థానంలో ఉన్నారన్నారు . కరోనా కష్టకాలంలో బాధితులకు ఈ సాయం ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. టీఆర్ఎస్ లోకసభ పక్షనేతగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం పార్లమెంటులో పోరాడుతున్నారన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడం కోసం ఎంపీ నామ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కూరాకుల నాగభూషణం గారు పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఖమ్మం, రఘునాథపాలెం, కొత్తగూడెం , పాల్వంచ, తల్లాడ, వేంసూరు, కల్లూరు, కామేపల్లి, మరిపెడ, వేలేరు మండలాలకు చెందిన 23 మందికి రూ” 10.61 లక్షల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరి గారు , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారిగారు, రైతుబంధు జిల్లా కమిటీ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుగారు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణగారు, చిత్తారు సింహాద్రి గారు, నామ సేవా సమితి జిల్లా అధ్యక్షులు పాల్వంచ రాజేష్ గారు, జిల్లా కార్యదర్శి చీకటి రాంబాబుగారు, సత్తుపల్లి ఇంచార్జీ రేగళ్ల క్రిష్ణప్రసాద్ గారు , సరిపూడి గోపిగారు, మునిగంటి భార్గవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

MP Nama Nageaswara Rao is taking special initiative in providing CMRF checks to families who are suffering financially due to illness.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.