కష్టకాలంలో పేదలకు ఎంపీ నామ ఆర్థిక చేయూత

0
TMedia (Telugu News) :

కష్టకాలంలో పేదలకు ఎంపీ నామ ఆర్థిక చేయూత

s s consultancy

20 మందికి రూ. 9,15,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

ఖమ్మం ఎంపీ నామ క్యాంప్ ఆఫీస్, బస్వాపురంలో చెక్కులు పంపిణీ

ఖమ్మం, జూన్ 4 : టిఆర్ఎస్
లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు చొరవ, కృషితో మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఆర్ధిక సాయాన్ని సకాలంలో బాధిత కుటుంబాలకు అందజేస్తూ పేదలకు చేదోడువాదోడుగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు అందగానే ఎంపీ నామ వెంటనే స్పందించి, సీఎం కేసీఆర్ తోను, మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకించి మాట్లాడి, లబ్ధిదారులకు త్వరితగతిన
ఆర్ధిక సాయం మంజూరుకు కృషి చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో మండలానికి చెందిన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఆర్ధిక సాయాన్ని అందజేస్తూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం కార్పొరేషన్ , రఘునాధపాలెం, చింతకాని మండలాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 9,15,500 విలువైన 20 చెక్కులను శుక్రవారం ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం, చింతకాని మండలం బస్వా పురంలో లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీ క్యాంప్ ఆఫీస్ సిబ్బంది బస్వాపురం, తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఖమ్మం ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ కనకమేడల
సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్
నల్లమల వెంకటేశ్వరరావు, రఘనాధపాలెం జెడ్ పిటిసి ప్రియాంక, పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్,
తన్నీరు రవికుమార్, ఎంపీ నామ వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు , నామ సేవా సమితి నాయకులు పాల్వంచ
రాజేశ్, చీకటి రాంబాబు, సరిపూడి గోపి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చింతకాని మండలం
బస్వాపురంలో జరిగిన కార్యక్రమంలో చింతకాని ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జెడ్ పీటీసీ పర్సగాని కిషోర్,
మండల ఉపాధ్యక్షులు గురజాల హన్మంతరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్,
జిల్లా కమిటీ సభ్యులు రమేశ్, స్థానిక నాయకులు వంకాయల పాటి లచ్చయ్య, బొడ్డు వెంకట్రామయ్య, వి.కొండలు, సోమ నాగేశ్వరరావు తది తరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.