అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు

0
TMedia (Telugu News) :

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే అమ్మకి..

మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..

అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే మహిళలను గౌరవిద్దాం. ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం’’

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..
అమ్మ మనసున అమృతమే చూడరా..
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా..

ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..

అమ్మ.. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే.
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.

అమ్మ సృష్టికే ఓ కానుక.. అమ్మ అనేది ఓ మధుర భావన
అమ్మ శక్తి అపారం.. అమ్మ యుక్తి అమూల్యం
ప్రేరణ అమ్మ.. లాలనా అమ్మ..
అమ్మ లేకుంటే అంతా శూన్యం..
అందుకే అమ్మకు శతకోటి వందనాలు..

అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే అమ్మలోని ప్రత్యేకత.

కళ్లు తెరిచిన క్షణం నుంచి..
బంధం కోసం.. బాధ్యత కోసం..
కుటుంబం కోసం..
అందరినీ కనుపాపలా తలచి..
ఆత్మీయతను పంచి..
తనవారి కోసం అహర్నిశలు కష్టించి..
తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు పాదాభివందనం..

s s consultancy
  • మాతృదినోత్సవ శుభాకాంక్షలు
    నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ..

కనిపించని దేవుడైనా.. కనిపెంచిన నీ తర్వాతే అమ్మా!!

అమ్మ.. నాకు మాటలు నేర్పమంటే తను కూడా నాలానే మాట్లాడుతుంది.
అమ్మ.. నేను పలికే కొత్త కొత్త మాటలకి అర్థాలు చెప్పే నిఘంటువే అమ్మ..
చందమామ రాదు అని తెలిసినా..
చందమామ రావే.. అని నా కోసం పిలుస్తుంది.. అమ్మ..
నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు అమ్మ.

అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..

మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే..
అది మనం పుట్టిన క్షణం మాత్రమే.. –

అమ్మ అన్నపదం అద్భుతం..
అమ్మకి అద్భుతం మన జీవితం

ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ

  • మాతృదినోత్సవ శుభాకాంక్షలు
    అమృతం లాంటి ప్రేమను చూపేది..
    అప్యాయత అనురాగం పంచేది అమ్మ –

ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా..
నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే

నీవు ఎంత వద్దనుకున్నా
నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే.

అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే..
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.

  • హ్యాపీ మదర్స్ డే అమ్మ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.