దళితులను మోసం చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :
s s consultancy

దళితులను మోసం చేసిన మంత్రి

టీ మీడియా వనపర్తి జిల్లా 22 జూన్ : పెబ్బేరు మండలం లోని కంచిరావుపల్లి గ్రామంలో గత ప్రభుత్వము దళితుల కోసం అని బీసిలతో కొన్న 3 ఎకరాల భూమిని దళితులను మభ్యపెట్టి తెరాస ప్రభుత్వం తీసుకున్ని రైతు వేదిక, పల్లె ప్రకృతి వనలను నిర్మాణం చేశారు అన్ని వనపర్తి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సమావేశంలో గుద్దేటీ రాజేష్ కుమార్ అన్నారు. గ్రామంలోని దళితులకు తక్షణమే 50 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంలో గ్రామస్థులు దాదాపు 150 మంది గుడిసెలు వేసుకొని ఉండగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామ దళితులను పిలిపించి ఒక ఎకర పొలంలో వీటిని నిర్మాణం చేసుకోని మిగతా రెండు ఎకరల పొలంలో దళితులకు ఇండ్లు ఇస్తాను అన్ని హమీ ఇవ్వాడం జరిగింది అన్నారు. దళితులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుదళితులకు ఇస్తాను అని చెప్పి న మూడు ఎకరాల పొలం ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు ఏమి సాంధించావని అంత మేమే చేస్తున్నాం అని గత ప్రభుత్వాలను నిందిచే ప్రభుత్వమా గత ప్రభుత్వం దళితుల కోసమని కొన్న భూమిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకున్నారో మంత్రి సమధానం చెప్పాలి .ఈ గ్రామంలోని ప్రజలకు న్యాయం చేయని యెడల జిల్లా కేంద్రంలో అన్ని కుల ప్రజ సంఘాల ఆధ్వర్యంలో నిరహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది.అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర గౌడ్,కొమ్ము చెన్నకేశవులు, గంధం బాలచందర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెబ్బేరు మండల అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త వినోద్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.