ప్రజలు ‘లాక్ డౌన్’కు సహకరించి ఇళ్లలోనే ఉండాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

0
TMedia (Telugu News) :

ప్రజలు ‘లాక్ డౌన్’కు సహకరించి ఇళ్లలోనే ఉండాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

s s consultancy

కుత్బుల్లాపూర్ ప్రతినిధి మే 24(టి మీడియా)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ లో స్థానికంగా నెలకొన్న రోడ్డు సమస్యపై కార్పొరేటర్ జ్యోతి నర్సింహా రెడ్డి మరియు కాలనీ వాసుల వినతి మేరకు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భారత దేశ వ్యాప్తంగా రోజు రోజుకు అతి వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్త వహించాలని సూచించారు. లాక్ డౌన్ కు సహకరించి ఇళ్లలోనే ఉండాలని కోరారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే భయపడకుండా నిర్ధారణ పరీక్ష చేసుకొని డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి మన వంతుగా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఒక్కొక్కరితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు రోడ్డు నెంబర్ 7సీ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని, తుర్క చెరువు వాకింగ్ ట్రాక్, కాలుష్య నీరు చెరువులో చేరకుండా చర్యలు తీసుకొని ఆహ్లాదకర వాతావరణం తలపించేలా సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, చందు ముదిరాజ్, ఆవుల జగన్ యాదవ్, బండారి లేఅవుట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.