శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర

సండ్ర వెంకట వీరయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా.....

0
TMedia (Telugu News) :

తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు.

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా శుక్రవారం  హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుకల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని కలిసి శ్రీవారి ప్రసాదాన్ని వారికి అందజేశారు. ఈ సందలుశ్రీ ర్భంగా వారికి సత్తుపల్లి నియోజకవర్గం లోని పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు.

Also Read:మున్నూరు కాపులకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం

s s consultancy

జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్తుపల్లి పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న 200 మీటర్ల ఫారెస్ట్ భూమిని డి నోటిఫై చేసి సత్తుపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలు ( వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, కోర్టు ,MRO ఎండిఓ కార్యాలయాలు…) కొరకు కేటాయించటం జరిగిందని ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని వెంగల్ రావునగర్ ప్రాంతంలో 35 ఎకరాల భూమిని ఫారెస్ట్ కార్పొరేషన్, ఫారెస్ట్ టింబర్ డిపోకు లీజుకు ఇవ్వడం జరిగిందని, అట్టి స్థలాన్ని సత్తుపల్లి పట్టణంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ నందు బొగ్గు ఉత్పత్తి కొరకు జరిపే బాంబ్ బ్లాస్టింగ్ ల కారణంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, వెంగల్ రావు నగర్, విరాట్ నగర్ మరియు సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టరం గ్రామ శివారులో నందు నివసిస్తున్న వారి ఇల్లు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరాయని కావున వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయవలసిందిగా కోరారు.

Also Read:అభివృద్దికి ఆమడ దూరంలో షాద్ నగర్ మున్సిపాలిటీ

అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వినతి పత్రం అందజేశారు అభివృద్ధి పనుల్లో భాగంగా
1. కాకర్లపల్లి గ్రామం నుండి క్రిమిటోరియం వరకు బీటీ రోడ్డు
2. కాకర్లపల్లి గ్రామం నుండి తాళ్లమడ రోడ్డు వరకు బిటి రోడ్డు వయా బేతుపల్లి చెరువు, తమ్మిలేరు కట్ట మీదుగా
3. లంకపల్లి నుండి కిష్టారం గ్రామం వయా గురవాయిగూడెం వరకు బిటి రోడ్డు
4. టేకులపల్లి గ్రామం నుండి కొర్లగూడెం గ్రామం వరకు బిటి రోడ్డు మరియు మధ్యలో బ్రిడ్జ్
5. మర్లపాడు గ్రామం నుండి అమ్మపాలెం గ్రామం వరకు బిటి రోడ్డు
6. రామన్నపాలెం గ్రామంలో పూర్వం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరినందున కొత్త వంతెన నిర్మించాలని కోరారు.
ఈ విషయాల పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్తుపల్లి పట్టణంలో టెంపర్ డిపోకి వినియోగిస్తున్న భూమిని వెంటనే ఇళ్ల స్థలాల కేటాయించే విధంగా ఏర్పాటు చేయాలని స్పెషల్ ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి గారికి ఫోన్ చేసి తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులను చేపడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.