వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎమ్యెల్యే పొందేం

0
TMedia (Telugu News) :
s s consultancy

టి మీడియా భద్రాచలం,
వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎమ్యెల్యే పొందేం

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల జాయింట్‌ క్రాస్‌ సెక్షనల్‌ సర్వేలో అంచనా వేసిన పరిణామాలను వారి సిఫార్సులను ఇరిగేషన్ ఈఈ,డిఈ లను అడిగి తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతున్న సమయంలో భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలలో భయం మొదలయింది,అన్నారు . ప్రస్తుత కరకట్ట మరియు స్ల్యూయిస్ వాల్స్ వరదను ఏమేరకు నిలువరిస్తాయనే విషయంలో సుదీర్గంగా ఎమ్యెల్యేఅధికారులతో చర్చించారు. గత సంవత్సరం వరదలు వచ్చిన సమయంలో ఎదురయిన సమస్యలను బట్టి ఈ సంవత్సరం మరల పునరావృట్టం కాకుండా చూడాలని దానికి సంబందించి నిలువకు కొత్త మోటార్లు కొనుగోలు చేసి రెడీగా ఉంచుకోవాలని, లీకేజీ లను అరికట్టడానికి ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, ముందుగానే లాంచ్ లు మాట్లాడుకుని అన్నీ అనుమతులతో సిద్ధంగా వుండే విధంగా చూడాలని ఆదేశించారు. అధికారులు ఈ 3 నెలలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తో నిత్యం వరదలపై మాట్లాడుతున్నట్లు, వారు కూడా ప్రతేకంగా శ్రద్ధ వహిస్తానని తెలియచేసినట్టుఎమ్యెల్యే తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.