“నేనున్నానని .. మీకేం కాదని”..నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి ఫోన్

0
TMedia (Telugu News) :

నర్సంపేట: 09-05-2021
వరంగల్ రూరల్ జిల్లా.

“నేనున్నానని .. మీకేం కాదని”…

s s consultancy
 • హలో.. ఎలా ఉన్నారు.
 • ఏం భయపడకండి.
 • మీకు నేనున్నాను, ధైర్యంగా ఉండండి.
 • కరోనా మిమ్మల్ని ఏమీ చేయదు.
 • ఐసోలేషన్ సెంటర్ లో ప్రశాంతంగా ఉండండి..
 • త్వరలోనే కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా.
 • ఏ ఇబ్బంది ఉన్నా నాతో చెప్పండి.
 • ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా ప్రయోగించండి.
 • మీ ఆరోగ్యమే మా లక్ష్యం..

ఇవీ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి కరోనా బాధితులతో ఫోన్ లైన్ లో మాట్లాడిన మాటలు. సుమారు అరగంట సేపు మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీ కోసం నేనున్నానంటూ భరోసా కల్పించిన మాటలు కోవిడ్ బాధితుల్లో కొండంత ధైర్యాన్ని నింపాయి. బ్రతుకుపై ఆశలు కల్పించాయి అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి బాధితులు కృతజ్ఞతలు తెలియచేశారు…


 • నర్సంపేట నియోజకవర్గంలోని 3538 కరోన బాదితులతో, వారి కుటుంబ సభ్యులతో నేడు ఎమ్మెల్యే గారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 • కరోన సోకిన వారు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా గుండె నిబ్బరంతో ఉండాలని ఎమ్మెల్యే గారు కోరారు.
 • ఈ సందర్భంగా నెక్కొండ మండలం చెరువుముందరి తండా నుండి బాలాజీ, ఇటుకాలపల్లి నుండి వీరన్న, మనుబోతులగడ్డ నుండి బాలు, నల్లబెల్లి నుండి రఘువరన్, ముత్యాలమ్మ తండా నుండి రాజేందర్ గార్లతో ఫోన్లో ముఖాముఖి మాట్లాడారు.
 • వారికి ప్రభుత్వ ఆసుపత్రి వారు అందిస్తున్న చికిత్స, జాగ్రత్త నివారణ చర్యలు, మెడిసిన్, పలు సేవల గూర్చి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
 • ఎవరూ ఆందోళన పడవద్దు…… ధైర్యంగా ఉందాము. మీకు అన్నీ విధాలుగా నేను అండగా ఉంటానని ఎమ్మెల్యే గారు భరోసానిచ్చారు..
 • మరీ ఇబ్బంది అనిపిస్తే నాకు గాని, నావద్ద పని చేసే సిబ్బందికి గాని ఫోన్ చేయండి అంటూ ఎమ్మెల్యే గృ కోవిడ్ భాదితులకు మనోధైర్యాన్ని నూరి పోశారు.
 • కరోన రోగులకు చికిత్స కోసం నర్సంపేట ప్రభుత్వ ఏరియా అసుపత్రి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని, అంతేకాక ఎమ్మెల్యే క్యాంపు ఎదురుగా ప్రభుత్వ ఆధీనంలో ఉచిత ఐసోలేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
 • ఏవైనా సందేహాలు ఉంటే మా హెల్ప్ లైన్ నెంబర్లు ఫోన్ చేసి సమాచారం పొందగలరు..
  హెల్ప్ లైన్ నెంబర్లు:
 1. 7989278978 (Dy. DM&HO)
  సిబ్బంది:
 2. 9959838414
 3. 9381333314
 4. 8008192191
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.