గ్రేటర్ అట్లాంటా తెలంగాణసొసైటీ ఆక్సిజన్ మిషన్లు ప్రభుత్వ ఆస్పత్రికి ఇచ్చిన ఎమ్యెల్యే

0
TMedia (Telugu News) :

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ

s s consultancy

సొసైటీ ఆక్సిజన్ మిషన్లు ప్రభుత్వ ఆస్పత్రికి ఇచ్చిన ఎమ్యెల్యే

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా,మే 04

కరోనా విపత్కర పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కోరారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారు విరాళంగా ఇచ్చిన రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్లను తన చేతుల మీదుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన పగడ్బందీ లాక్ డౌన్ తో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అన్నారు. కరోనా లక్షణాలు కనబడే వారి ఇంటికే మెడికల్ కిట్లను పంపించి హోం ఐసోలేషన్ చేయించడం ద్వారా కరోనా బాధితులు తొందరగా కోలుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వాసుపత్రికి దాతలు ఇచ్చిన ఈ కాన్సన్ట్రేషన్ మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని కొనియాడారు. ఈ పరిస్థితుల్లో దాతలు పేదలకు సేవ చేసేందుకు పలు రకాలుగా ముందుకు రావడం హర్షించదగినదని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నా, విదేశాల్లోరూ.2 లక్షల విలువగల రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్లను లక్సెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి విరాళంగా ఇచ్చిన అమెరికాలోని తెలంగాణ గ్రేటర్ అట్లాంటా సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిషన్ రావు, డైరెక్టర్ కాసం గణేష్ లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ ఆకుల శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు చెట్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.