మిషన్ భగీరథ డబ్బులు హాంఫట్;ఓకే ఇంటికి రెండు కనెక్షన్లు:పైపులు మాయం

0
TMedia (Telugu News) :

మిషన్ భగీరథ డబ్బులు హాంఫట్;ఓకే ఇంటికి రెండు కనెక్షన్లు:పైపులు మాయం

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలి అని సదుద్దేశంతో మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెడితే దానిని కొంతమంది అక్రమార్కలు ఖమ్మం కార్పొరేషన్ లో స్వార్ధానికి వినియోగించు కొన్నారు.గత పాలక వర్గ కాలం లో ఈ అవినీతి జరిగింది.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మరో అవినీతి వెలుగు చూసింది.ఇప్పటి ఎల్ ఆర్ఎన్ డేటా ఆపరేటర్ లు అంటూ అనధికారికంగా నియామకాలు చేసి ,10 లక్షలు కాజేసే ప్రయత్నం చేసి పట్టణ ప్రణాళిక విభాగం వారు అడ్డంగా బుక్ అయ్యారు.చేసిన కాలం కువేతనాలు ఇవ్వక పొగ ఉద్యోగాలు నుండి తొల గించారని బాధితులు పిర్యాదు మేరకు విచారణ సాగుతోంది.

తాజాగా నగరం లో మిషన్ భగీరథ పథకం క్రింద ప్రతి ఇంటికి పంపు కనెక్షన్లు ఇచ్చే పధకం లో బారి అవినీతి బైట పడింది..ఓకే ఇంటికి నిబంధనలు కు విరుద్ధంగా రెండు కనెక్షన్లు ఇవ్వడం తో పాటు.కొన్ని చోట్ల ఇనుప పైపులు వెయ్యలేదు.అసలు ఇంటి లోపలికికనెక్షన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు కూడా రికార్డులు సృష్టించి నట్లు బైట పడింది.కొన్ని చోట్ల .మీటర్ డబ్బాలు కూడా మాయం అయ్యాయి..వాటర్ పైపులు విషయం చెప్ప నవసరం లేదు.దుర్వినియోగం ఆయిన మొత్తము కోట్లు ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నిబంధనలు కు విరుద్ధంగా పనులు

మిషను భగీరథ పధకం క్రింద ఇంటికి కనెక్షన్లు పనులు నిబంధనలు కు విరుద్ధంగా .కేవలం మట్టి పని వారు నిర్వహించారు.వాటర్ లైన్ నుండి ప్రభుత్వ ఖర్చు తో వేసే పైపు కు చివర ఇనుప పైపు 3 అడుగులు ది వేయాలి.దీని ఖరీదు 200 లు వరకు ఉంటుంది.సుమారు 10వేల కనెక్షన్లు కు అసలు పైపులు వేయలేదు.అవిదంగా 20 లక్షలు వరకు స్వాహా అయినట్లు తెలుస్తోంది..క్రాసింగ్ ఉంటే రోడ్డు ను కట్ చేసి అందులో పైపు వేసి ఇంటి లోకి కనెక్షన్లు ఇవ్వాలి.లోన మెటారు కు లింక్ చెయ్యాలి.ఇవి ఏమి చెయ్యకుండా మీటరు కూడా పెట్టనవి,పైపు రోడ్డు పై వది లేసినవి మరో 15 వేలు కనెక్షన్లు వరకు ఉన్నాయి..ఈ విధంగా వదిలి వేయడం ద్వారా ఒక్కో కనెక్షన్ కు 3000 లు వరకు మొత్తము గా 45 లక్షలు వరకు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.ఇటువంటి వి పేదలు,మధ్యతరగతి వాళ్ళు నివసించే సంబాని నగర్ లాంటి చోట ఉన్నాయి .

s s consultancy

రెండు కనెక్షన్లు

ఓకే ఇంటికి రెండు మిషన్ భగీరథ. కనెక్షన్లు ఇచ్చిన వైనం నగరం లోని మామిళ్లగూడెం,సారధి నగర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఉంది..ఈ విషయం లో కూడా భారీ మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది.ఈ అవినీతి లక్షల్లో ఉంది అనే అభిప్రాయము వ్యక్తం అవుతోంది.ఈ ఆక్రమం గత పాలక వర్గం లోని కొంత మంది తాజా మాజిల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.మామిళ్లగూడెం కంట్రోల్ షాప్ ఎదురుగా ఉన్న ఓకే మొత్తఉన్న ,ఓకే ఇంటికి రెండు ఇంటి నెబర్లు, రెండు మిషన్ భగీరథ కనెక్షన్లు ఉండడం ఖమ్మం కార్పొరేషన్ అవినతి ఏ స్థాయిలో ఉందొ తెలుస్తోంది.

పైపులు మాయం

మెయిన్ లైన్ నుండి ఇంటి కి కనెక్షన్లు ఇచ్చే లక్షలు విలువ చేసే పైపు మాయం అయినట్లు తేలుస్తోంది.ఈ పైపు వేయకుండానే వేసినట్లురికార్డుల్లో చూపినట్లు తెలుస్తోంది..

పర్యవేక్షణ కరువు

పనులు జరిగే టప్పుడు ముఖ్యంగా పంపు మీటర్లు బిగించే పనిని సాంకేతిక నిపుణులు చెయ్యాలి.అందుకు విరుద్ధంగా మట్టి పని వారే మీటర్లు బిగించే పని చేసారు..రికార్డులు లో మాత్రం టెక్నీషియన్ ఉన్నట్లు చూపించి నట్లు తెలుస్తోంది.మొత్తం పనిని ప్రవేక్షించ డానికి కనీసం డిప్లొమా స్థాయి ఉద్యోగి ఉండాలి.అటువంటిది లేదు.ఉన్నట్లు రికార్డుల లో చూపి బొక్కసం పెట్టినట్లు సమాచారం. ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరింత అవినీతి వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.