ఆసుపత్రికి మిషన్ భగీరథ నీటి కనెక్షన్.. కలెక్టర్

0
TMedia (Telugu News) :

ఆసుపత్రికి మిషన్ భగీరథ నీటి కనెక్షన్ కల్పించేలా చర్యలు చేపట్టాలి :

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,మే 23:

వంద పడకల ఆసుపత్రి సముదాయానికి మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

s s consultancy

ఆదివారం ఆయన తిప్పాపూర్ లోని వంద పడకల ఆసుపత్రి సముదాయాన్ని సందర్శించి నీటి నిల్వ కోసం నిర్మించిన సంపును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం లోగా ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన నీటి సంపుకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్ ను ఆదేశించారు. 1.5 లక్షల నీటి సామర్థ్యం గల ట్యాంకు అందుబాటులో ఉందని, పైప్ లైన్ ద్వారా బల్క్ కనెక్షన్ ఈరోజు సాయంత్రం వరకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

అంతకముందు కలెక్టర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జనరల్, ఐసీయూ వార్డులను సందర్శించారు. మెడికల్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆసుపత్రిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్శనలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, డా.మహేష్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.