నాయి బ్రాహ్మణులు,రజకులు సమాజ సేవకులు – మంత్రి ఈశ్వర్

0
TMedia (Telugu News) :

నాయి బ్రాహ్మణులు,రజకులు సమాజ సేవకులు – మంత్రి ఈశ్వర్

s s consultancy

టీ మీడియా,జగిత్యాల,జూన్ 22

జమ్మికుంట స్వర్ణ గార్డెన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ,రజక నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఒక్క మాటలో చెప్పాలంటే నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు సమాజ సేవకులని అన్నారు.అందుకే వీరికి సేవ చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని,ఈ సమావేశంలో అత్యంత పేదరికం ఉన్నా ఎస్సి,ఎస్టీ కులస్థులు తరువాత పేదరికం ఉన్నవారు నాయి బ్రాహ్మణ, రజకులే.గ్రామాలలో ఉన్న వారికి భూమి జాగ వ్యవసాయ ఉండవని,90 శాతం కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూం విషయానికి వస్తే 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు అవగ వాటి నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు.రానున్న కాలంలో 4 వేల బెడ్రూంలతో పాటు మరిన్ని మంజూరు చేసుకోవడం జరుగుతుందని సూచించారు.అలాగే ఎవరి స్థలం లో వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించే ప్రయత్నం జరుగుతున్నదని,ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో నాయి బ్రాహ్మణ, రజకులకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గంతో పోలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో 1000 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కావడం, ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఎస్సి,ఎస్టీ,బిసి,మైనారిటీలకు ఇల్లు కావాలని ఆకాంక్ష అందరికీ ఉంటుంది కాబట్టి ఈ కళ తెలంగాణ రాష్ట్రంలోనే నెరవేరుతుందని అన్నారు.జీహెచ్ఎoసి ఎన్నికలలో రజకులకు సంబంధించి 250 యూనిట్ల కరెంటు ఇవ్వడం జరిగిందని, ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల నాయి బ్రాహ్మణుల సెలూన్ల ఆధునికత కొరకు వారికి 1లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాలని భావిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.