ఫీడర్ ఛానల్ పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఫీడర్ ఛానల్ పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
టీమీడియా బాల్కొండ;మే28:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు.
ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడీ చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నింపడానికి ఫీడర్ చానల్లో కొంత భాగము పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉండటంతో పైప్ లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని కల్ పరిశీలించారు. ఈ లిఫ్ట్ ద్వారా సుమారు ఏడు గ్రామాలకు సాగునీటిని అందించడమే లక్ష్యం నిధుల మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఆయా గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని పలకరించిన మంత్రి
పైప్ లైన్ చిన్న చిన్న మరమ్మత్తులు వారంలో పూర్తి అవుతాయి
వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తి సిద్ధం అవుతుంది అన్నారు.
అనంతరం పల్లికొండ(వేంగంటి) ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్ ను పరిశీలించారు.మోటర్ల పనితీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీటిని తోడేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పైప్ లైన్ లీకేజీలు,లిఫ్ట్ మోటర్ల చిన్న చిన్న మరమ్మత్తులు వారంలోగా పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.అనంతరం పల్లికొండ చెరువును పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు కాళేశ్వరం ద్వారా మరియు తెలంగాణ లోని లిఫ్ట్ ల ద్వారా చెరువులను నింపుకోవాలనే ఆలోచన చేయడంతో నియోజకవర్గంలో ని వేముగంటి, పల్లికొండ ఎత్తిపోతల యొక్క మోటార్లుని పరిశీలించామన్నారు.ఇక్కడి రైతులు దీనికి సంబంధించిన విషయాలు ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వర్షాకాలం ఆరంభంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకి సూచించినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.