స్వల్ప లక్షణాలతో కరోనా బారిన మంత్రి కొప్పుల ఈశ్వర్

0
TMedia (Telugu News) :

స్వల్ప లక్షణాలతో కరోనా బారిన మంత్రి కొప్పుల ఈశ్వర్

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 09)జగిత్యాల జిల్లా:

ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉంటూ
ఆపత్కాలంలో సాయమందించిన ఈ చేతులు ఎప్పుడూ చల్లగుండాలని, సుమారు సంవత్సర కాలం నుండి కరోనా పోరులో ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు సూచనలతో భరోసా ఇస్తూ అందుబాటులో ఉండతున్నారు. అందుబాటులో రావడమే నిజమైన నాయకత్వమని టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు అన్నారు.పదవి అంటే హోదా అని భావించకుండా ఒక సామాజిక బాధ్యత అంటూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా,ఒకవైపు ఎప్పటికప్పుడూ సంబంధిత అధికారులతో సమీక్షలు,తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ జరుపుతూనే ఉన్నారని అన్నారు.మరోవైపు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కొన్ని వేల నిరుపేద కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో ఆకలి కేకలకు స్వస్తి పలికించి కడుపు నింపిన అన్నదాత కొప్పులఈశ్వర్ అని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.ఈరోజు స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు.మంత్రి త్వరగా కోలుకుని తెలంగాణ ప్రజలతో పాటుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఈ కష్ట కాలంలో మరిన్ని సేవలు అందించాలని నాయకులు,కార్యకర్తలు తదితరులు పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.