నిరంజన్ రెడ్డి  క్షమాపమంత్రిణ చెప్పాలి..

నిరుద్యోగులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు తెలిపారు.

0
TMedia (Telugu News) :

 

నిరుద్యోగులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :- మంత్రి గారు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేమని యసంగి లో, వానకాలం పంటలో ప్రతిసారి రెండు నెలలపాటు కొనుగోలు కేంద్రం వద్ద అమాలి పని పుష్కలంగా దొరుకుతుంది..

Also Read:ఆయుష్ సేవలు అభినందనీయం

s s consultancy

అని నిరుద్యోగులను ఉద్దేశిస్తూ పేర్కొనడం మంత్రిగారి అహంకారానికి నిదర్శనమని దీనికి బేషరతుగా నిరుద్యోగులు అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని , నాడు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి లోకం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వరాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయి అని కోటి ఆశలతో ఉద్యమంలో పాల్గొని , స్వ రాష్ట్రాన్ని సాధించారని కానీ నేటి స్వరాష్ట్ర తెలంగాణలో నిరుద్యోగ బతుకులు ఆగం అయ్యాయని, ఈగ నోటిఫికేషన్ అగో నోటిఫికేషన్ అంటూ వాళ్ల ఎలక్షన్ కోసం మాత్రమే నిరుద్యోగులను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఉన్నారని ఇది సిగ్గుమాలిన చర్య అని మంత్రి గారు తమ పిల్లల్ని కూడా అదే హామాలి కేంద్రం వద్ద పని చేయిస్తారా? అని హామలి కేంద్రం వద్ద ఉండే కూలీలు కూడా మా తల్లిదండ్రులు అని పేర్కొనడం జరిగింది.

Also Read:జగ్జీవన్ రామ్ స్పూర్తితో దళితుల పథకాలు

హమాలీ పని చేస్తున్న కార్మికులను ఉద్దేశపూర్వకంగానే మంత్రి అవమాన పరిచారని హమాలీలకు కూడా మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు త్వరలో మా నిరుద్యోగులు యొక్క సత్తా ఏంటో చూపిస్తామని త్వరలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చదువుకున్న నిరుద్యోగ మేధావులందరికి సమీకరించి ఉపాధి కై పోరాటం చేస్తామని అన్నారు… ఈ కార్యక్రమంలో SFI నాయకులు పేరు స్వామి, పొన్నం ప్రదీప్, రాజు తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.