52 వ డివిజన్ లో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ…

0
TMedia (Telugu News) :

ఖమ్మం:
ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రాముడు పుట్టినరోజు సందర్భంగా 52వ డివిజన్‌లో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ.
ఈ సందర్భంగా 52వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకటేశ్వర్లు (వెంకట్ కుమార్) ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. నిరాడంబరంగా, నిష్కల్మషంగా, నిర్మొహమాటంగా నిత్యం రాష్ట్ర ప్రగతి సాధనలో, ప్రజా సంక్షేమంలో నిరుపమాన సేవలు చేస్తూ నిబ్బరంగా ముందుకు సాగుతున్న రామన్న నిండు నూరేళ్లు జన జీవితంలో కొనసాగుతూ మహోన్నతులు కావాలని మనస్ఫూర్తిగా దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష పర్యావరణ పరిరక్షణ కోసం ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని, ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటడమే నాకు అత్యంత సంతోషం ఇచ్చేదని చెప్పిన గొప్ప సంస్కారవంతమైన నేత కేటీఆర్ గారు పది కాలాలు పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యన్. సురేష్, సుత్రాల శ్రీనివాస్, మేడేపల్లి రమేష్, యస్కె. ఉస్సెన్, భాషా, అంగన్వాడి టిచర్స్ రజియా, దుర్గా, సుమమాల, ఆర్పిలు ఫాతిమా, మమత, సాయి దుర్గా డివిజన్ పెద్దలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.