లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు

0
TMedia (Telugu News) :

మెల్‌బోర్న్‌ : గత రెండు రోజులుగా కరోనా వైరస్‌ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం ముందస్తుగా లాక్‌డౌన్‌ను పొడగించింది. కొవిడ్‌ను కట్టడి చేసేందుకే సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్తున్నది. అయితే, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు విషమంగా మారాయి. ఇప్పటివరకు 218 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మెల్‌బోర్న్‌లో ఆందోళనాకారుల దాడిలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.

s s consultancy

ఆస్ట్రేలియాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా కేసులు విపరీతంగా పెరుగుతున్న సిడ్నీ, విక్టోరియా, మెల్‌బోర్న్‌తో పాటు అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. దాంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మెల్‌బోర్న్‌లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళన చేస్తున్న దాదాపు 218 మందిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.3 లక్షల వరకు రాబట్టారు. ఆస్ట్రేలియాలో శనివారం 894 కరోనా కేసులు బయటపడ్డాయి. మరోవైపు, న్యూజిలాండ్‌లో 14 మంది కొత్త కరోనా రోగులను గుర్తించారు. ఇంకోవైపు, రోగుల సంఖ్య పెరుగుదల కారణంగా శ్రీలంకలో 10 రోజుల లాక్‌డౌన్ విధించారు.

The Australian government has extended the lockdown a head of a large number new cases of the corona virus over the past two days .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.