మెడికల్ మాఫియా హబ్ గా ఖమ్మం:అనుమతులు లేకుండ నిర్వహణ:అనదికార వ్యక్తులు నిర్వహణ

0
TMedia (Telugu News) :

మెడికల్ మాఫియా హబ్ గా ఖమ్మం:అనుమతులు లేకుండ నిర్వహణ:అనదికార వ్యక్తులు నిర్వహణ

(టీమీడియా-ప్రత్యేక ప్రతినిధి)

అతని చదువేంటో తెలియదు..ఎవరు మమ్మల్ని ఏమిచెయ్యలేరు డ్రగ్ ఇన్స్ పెక్టర్ అండ ఉండ గా మాకు ఎల చింత అన్న విధంగా కొంతమంది మాఫియాగా ఏర్పడి మనుషుల మందులు విక్రయిస్తు జనం ధనం,ప్రాణాలు తో చెలగాటం ఆడుతున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రహదారు ల్లో ఉన్న,గ్రామీణ ప్రాంత వాసులు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ఎక్కువగా మాఫియా చెల రేగుతోంది. కాలం చెల్లిన మందులు అంట గడుతున్న వైనం వెలుగు చూసింది.వీటి అన్నిటికీ తోడు అనుమతులు లేకుండా మందులు షాప్ లు,డిస్టిబ్యూటర్లు ముఖ్య కూడలి లో…ఖమ్మం జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ కార్యాలయము కు కూత. వేటు దూరం లో దందా జరుగుతున్న పట్టనట్లు ఉండడం అనుమానం కలిగిస్తోంది.అధికారులు బినామీ పేర్లతో నడిపిస్తున్న రా అన్న చర్చ ఉంది..ఇంజిక్షన్లు బ్లాకు దందాపోలీస్ ద్వారా వెలుగు చూసి వారం అవుతున్న స్పందించాల్సిన డ్రగ్ ఇన్స్ పెక్టర్ నోరు మెడపక పోవడం అనుమానం లకు బలం చేకూరుస్తుంది.

అక్రమాలు ఇవిగో

👉ఖమ్మం మామిళ్లగూడెం లో లెక్కకు మించి మెడికల్ డిష్టి బ్యూటర్లు ఉన్నాయి.ఏ ఒక్కటి నిబంధనలు కు అనుగుణం గా లేవు. నివాస గృహాలు,పురాతన భవనాల లో కనీస జాగ్రత్త లు లేకుండా ఉన్నాయి..అదే అదేప్రాంతం లో జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ కార్యాలయం ఉంది

s s consultancy

👉మామిల్లగూడెం పోస్ట్ అఫిస్ సమీపం లోని ఒక ఇంట్లో నిల్వలు పెట్టి అనదికరికంగా ఒక వ్యక్తి డిస్టిబ్యూటర్ నిర్వహిస్తున్నాడు.ఇతను మెడికల్ రిప్రజనుటేటివ్ లువద్ద శాంపిల్ లు సేకరించి .స్టిక్కర్లు వేసిషాపులకు అమ్ముతారు అన్న పేరుంది.

👉ఆస్పత్రులు లో అనది కార మెడికల్ షాప్ లకు కొదవ లేదు కోవిడ్ వైద్యం చేస్తున్న పెవిలియన్ గ్రౌండ్ సమీపం లోని ఆస్పత్రిలో అనధికార మెడికల్ షాప్ లో బైట రూపాయి కి దొరికే మాత్ర 4 రూపాయలు.. ఓవర్ బ్రిడ్జి సమీపం లోని సంతాన సాఫల్య కేంద్రం ఆస్పత్రి లో ని అనధికార మందుల షాప్ కి .ఏకాంగ మెడికల్ షాప్ అని తెల్ల కాగితం పై రాసి అంటించాడు. స్టేషన్ రోడ్డులో మరో హాస్పటల్ లో ని అనది కార షాప్ లో కనీసం కంప్యూటర్ బిల్లు ఇవ్వరు. ఇటువంటి వి ఖమ్మం లో 50 వరకు ఉన్నాయి.

👉ఖమ్మం ముస్తఫానగర్ మెయిన్ రోడ్ లో ఆస్పత్రి పెక్కన అనధికార మెడికల్ షాప్ నెల రోజుల నుండి నడుస్తోంది ఇక్కడ కనీసం కంప్యూటర్ బిల్లు లేదు ఒక మైనర్ నిర్వాహకుడు గా ఉన్నాడు.ఇదే ప్రాతం లోని ఒక మెడికల్ షాప్ లో గడువు ముగిసిన మందులు విక్రయాలు చేస్తున్నారు

👉25 రూపాయల విలువ చేసే ఓఆర్ఎస్ 35 నుండి 40రుపాయలకు విక్రయిస్తున్నరు.మందుల రేట్లు చెప్పనవసర ము లేదు

👉షాప్ లో ఉండే వారు కనీసం చేతులకు గ్లవు స్ అనేవి ఉండవు డ్రెస్ కోడ్ ఉండదు.. కనీసం డి ఫార్మశీ చదివిన వారు మాత్రమే మందులు విక్రయం చేయాలి షాప్ లలో ఉండాలి.. వారి సర్టిఫికేట్ లు తప్ప మనుషులు ఉండరు.. ఐయిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కి పట్టదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.