గిరిజనులను దోపిడీ చేస్తున్న మీసేవ సెంటర్.

గిరిజనులను దోపిడీ చేస్తున్న మీసేవ సెంటర్.

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ కార్యాలయం లో ఉండాల్సిన ఆధార్ సెంటర్ మీ సేవ సెంటర్ లో ఏర్పాటు చేసుకొని గిరిజనులకు అన్యాయం చేస్తున్నా చేతన్ మీసేవ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని యువజన సేవా సమితి వ్యవస్థాప అధ్యక్షుడు గుమ్మడి రాజు డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Also Read:ఉపాధి హామీ సిబ్బంది నల్ల బ్యడ్జీతో నిరసన

s s consultancy

భద్రాచలం పట్టణంలో చేతన్ మీ సేవ పేరిట గత కొంతకాలంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ సేవను నడపడం జరుగుతుంది కానీ ఆ మీ సేవలో పేద ప్రజల దగ్గర నుండి పెద్దమొత్తంలో అధిక దోపిడీకి పాల్పడుతు, అప్లికేషన్ల పేరిట పేద ప్రజల దగ్గర నుండి డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అధికారులను సైతం లెక్క చేయకుండా సొంత పెత్తనాలు చేస్తూ అడిగిన వారిని దుర్భాషలాడుతూ ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.

తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి అట్టి చేతన్ మీసేవ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సమితి కోరింది.ఈ కార్యక్రమంలో వివైఎస్ఎస్ నాయకులు గుమ్మడి రాజు, రమణ, క్రాంతి, నవీన్ ,నజీర్ రవన్న తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.