మాట ఇచ్చాడు…నిలుపుకున్నాడు..ఆర్జేసీ కృష్ణ

0
TMedia (Telugu News) :
s s consultancy

మాట ఇచ్చాడు…నిలుపుకున్నాడు
💐పట్టువదలని విక్రమార్కుడు పువ్వాడ అజయ్
💐త్రీ టౌన్ ప్రాంత రూపురేఖలు మార్చేలా కార్యాచరణ
💐దశాబ్దాల నిర్లక్ష్యానికి విముక్తి.
💐ప్రభుత్వం నిధుల మంజూరుపట్ల ప్రజల హర్షం
💐 త్రాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టిన మంత్రి
💐స్థానికులకు తీరనున్న ‘పానీ’పాట్లు
💐మంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఆర్జేసీ కృష్ణ
శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టువదలని విక్రమార్కుడిలా ఖమ్మం త్రీటౌన్ ప్రాంతాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్న అభివృద్ధి శ్రామికుడు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని టి.ఆర్.ఎస్.పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జ్ గుండాల(ఆర్జేసీ)కృష్ణ అన్నారు.ఈమేరకు గాంధీ చౌక్ కూడలి ఏర్పాటు డ్రైన్లు, రోడ్లునిర్మాణం,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.దీనిలో భాగంగా తాగునీటి సమస్యపై దృష్టి సారించి సైనికుడిలా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
గతంలో ఖమ్మం నగరానికి త్రాగు నీరు అందించిన ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు కుళాయిలు,ట్యా0కర్ల వద్ద ‘పానీ’పాట్లు పట్టాల్సిన పరిస్థితి ఉండేదని,తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ల సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందుచూపు తో కూడిన చొరవతో ప్రభుత్వం పనితీరు తో ప్రస్తుత వేసవిలో కూడా సమృద్ధిగా నీరు లభిస్తుందన్నారు.ఈమేరకు స్థానికంగా ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఉన్న మున్నేరుపై నీరు వృధాగా పోకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేందుకు చెక్ డ్యాం నిర్మాణం చేపట్టి వృధా ను అరికట్టేలా మంత్రి అభ్యర్థన మేరకు ప్రభుత్వం రూ 7.45 కోట్ల నిధులు మంజూరు చేసిందని వివరించారు.ఖమ్మం నగరంలో ప్రధానంగా మూడవ పట్టణ ప్రాంతంలో మే నెలలో గత ప్రభుత్వాల అసమర్థత వల్ల త్రాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునేవారని,
దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆపరిస్థితి కి విముక్తి లభించ బోతుందన్నారు.ప్రస్తుతం
ఆపనులు మంత్రి స్వీయ పర్యవేక్షణలో పూర్తికా వచ్చాయని తెలిపారు.
నిర్మాణం పూర్తి అయిన తర్వాత భవిష్యత్ లోనూ నీరు సమృద్ధిగా అందుతుందన్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో మండుటెండలో సహితం భూగర్భ జలాలు పెరిగి బోర్లల్లో నీరుకూడా ఇబ్బంది లేకుండా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్లతాగునీరే కాకుండా సాగునీరుకుడా పక్కగ్రామాల్లో రైతులకు అందుతుందని తెలిపారు.దీనివల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ లోని కొంత ప్రాంతం కు చెందిన రైతులు ఆనందంగా ఉంటారన్నారు.అంతేకాకుండా నగరంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ తరహాలో మున్నేరు బండ్ గా ఏర్పడి బతుకమ్మ పండుగ సంబరాలకు, వైకుంటాదామాల అవసరాలకు నీటి కొరత ను తీర్చడంతో పాటు ట్యాంకుబండ్ తరహాలో బోటింగ్,విహార కార్యక్రమాలకు పర్యాటక ప్రదేశంగామారి ప్రజలకు ఆహ్లాదాన్ని,
ఆనందాన్ని పంచే అవకాశం ఉందన్నారు.దుర్గంధం వెదజల్లే ప్రజల దీర్ఘకాలిక కాలిక సమస్య అయిన గోళ్లపాడు కాలువను రూ 100కోట్లతో ఆధునీకరణ చేస్తున్నారని, దీనివల్ల ఆప్రాంతంలో పార్కులు ఏర్పాటు చేసి చెక్ డ్యాం నీటి ద్వారా ఆ ప్రాంతాన్ని పచ్చదనం తో సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యాన్ని పంచేలా పువ్వాడ కార్యాచరణను రూపొందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పక్కన కరోనా ను అదుపు చేస్తూనే ఇటువంటి కార్యక్రమాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ లకు కృష్ణ ఈ సందర్భముగా కృతజ్ఞతలు తెలిపారు…..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.