బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

0
TMedia (Telugu News) :

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

s s consultancy
  • బాల్య వివాహాలు బాలల అభివృద్ధికి ఆటంకాలు.
    -సి డి పి ఓ బాల్య వివాహ నిరోధక అధికారి సి.హెచ్.అవంతి

(మొగుళ్ళపల్లి, మే 30 టీ మీడియా)
బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని సిడిపిఓ, బాల్య వివాహ నిరోధక అధికారి అవంతి అన్నారు. శనివారం రాత్రి మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారనే విషయం తెలుసుకుని వెంటనే అదే రాత్రి తాను జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, మొగుళ్లపల్లి ఎస్సై మహేందర్ తో కలిసి గ్రామానికి చేరుకొని బాలికకు, బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వివాహాన్ని నిలిపివేసి బాలికకు 18 సంవత్సరాలు నిండే వరకు వివాహం చేయబోమని బాలిక తల్లిదండ్రులు దగ్గరుండి వ్రాతపూర్వక హామీని గ్రామ సర్పంచ్ సమక్షంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ… చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని, అంతేకాకుండా అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, పోషకాహార లేమి ఏర్పడి రక్తహీనత వస్తుందని, చిన్నతనంలో గర్భం ధరించడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి పలు భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ… తల్లిదండ్రులు తమ పిల్లలను భారంగా భావించవద్దని, ప్రభుత్వం అందించే ప్రీ & పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు, వివిధ పథకాలను ముఖ్యంగా బేటీ బచావో – బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు విద్యా, వసతి కొరకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మొదలగువాటిని వినియోగించుకొని బాలలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. అనంతరం ఎస్సై మహేందర్ మాట్లాడుతూ… బాల్య వివాహ నిషేధ చట్టం- 2006 ప్రకారం ఏ వ్యక్తి అయినా బాల్య వివాహాన్ని నిర్వహించినా, ప్రోత్సహించిన లేదా జరపడానికి సహాయపడినా అట్టి వ్యక్తులకు రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా ఒక్కోసారి రెండు కూడా విధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, సోషల్ వర్కర్ లింగారావు, సర్పంచ్ మాధవి, అంగన్వాడీ టీచర్లు వేముల స్వరూప, జ్యోతి, అనిత, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.