బాలికను గర్బవతిని చేసి.. శీలానికి వెలకట్టే యత్నం..?

0
TMedia (Telugu News) :

బాలికను గర్బవతిని చేసి.. శీలానికి వెలకట్టే యత్నం..?

s s consultancy

టీమీడియా:మహిభూబాద్ మే31:

పెళ్లిచేసుకుంటానని నమ్మించి బాలికను గర్భవతిని చేసి ఇప్పుడూ పెళ్లికి ఓ యువకుడు నిరాకరించడంతో ఆ..బాలిక బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది..
మహబూబాబాద్ జిల్లా
జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం… హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలిక గర్భవతిని చేసి మోసం చేసాడంటూ ఆత్మహత్యయత్నం చేయడం తీవ్రచర్చకు తెరతీసింది..
మహబూబాబాద్ జిల్లా
కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ చేసుకుందామని మూడు రోజులు గా తిప్పిస్తు…రాజీ పడాలని పెద్దమనుషులతో ఒత్తిడి చేయిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మైనర్ గర్భిణీ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. స్థానికులు గమనించి ఆ
గర్భిణిని కాపాడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.పట్టణ పోలీసులు
గర్భవతిని చేసిన యువకుని పై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.