.డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ఉన్మాది;ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

.డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ఉన్మాది

s s consultancy

టీ మీడియా కడప : ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బద్వేల్ మండలం చింతల చెరువులో యువతి గొంతుకోశాడు ఉన్మాది చరణ్. మృతురాలు బద్వేల్ కు చెందిన డిగ్రీ విద్యార్థి శిరీషగా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని. ఈ ఘాతుకానికి ఇదే కారణమై
ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు చరణ్ ను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువులో శిరీష(19) అనే యువతి తనను ప్రేమించట్లేదని.. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లిన చరణ్.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు శిరీష నిరాకరించింది. దీంతో అతి కిరాతకంగా యువతి గొంతు కోసేశాడు. విషయం గమనించిన
స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి
తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత చరణ్ కూడా పురుగుల మందు తాగినట్లు సమాచారం. చరణను పట్టుకుని గ్రామస్తులు, యువతి బంధువులు చితకబాదారారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని బద్వేల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి
తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే చరణ్ ఉన్నాడు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.