*నిర్లక్ష్యంగా లారీలనడిపితేకఠిన చర్యలు :ఏఎస్పీ

0
TMedia (Telugu News) :

టీమీడియా మణుగూరు;
జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్ గారు లారీ ఓనర్స్ మరియు బొగ్గు రవాణాకు సంబంధించిన వ్యక్తులతో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్ మాట్లాడుతూ లారీ డ్రైవర్లు మద్యం మత్తులో లారీలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారని తెలియజేసారు.నిర్లక్ష్యంగా లారీలను నడుపుతూ సామాన్య ప్రజలు ప్రాణాలను కోల్పోవడానికి కూడా కారణమవుతున్నారని తెలిపారు.రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు.లారీల యజమానులంతా తమ తమ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ముందు ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు సూచనలు ఇస్తూ ఉండాలని సూచించారు.నిర్లక్ష్యంగా లారీలను నడిపే డ్రైవర్లను విధుల నుండి తొలగించి బాధ్యతగా నడిపే వారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగినా వారిపై కేసులు నమోదు అట్టి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

s s consultancy

ఈ సమావేశంలో మణుగూరు సిఐ భాను ప్రకాష్,ఎస్సైలతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.