సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. …..జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి.

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా, జులై 27

మున్సిపాలిటీ సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి స్థానిక తహశీల్దార్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక గోదావరి రోడ్డులో గల ప్రభుత్వ భూములను మున్సిపల్ పాలక వర్గం, అధికారులతో కలసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మున్సిపాలిటీలో ఏర్పాటు చేయబోయే10 ఎకరాల స్థలాన్ని,డంపింగ్ యర్డ్ కు అదనంగా మరో 4 ఎకరాలను డంపింగ్ యార్డ్ కు సేకరిస్తున్నామన్నారు.

s s consultancy

మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా గతంలో గోదావరి నది ప్రాంతంలోని భూములకు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం పొందిన భూ యజమానుల నుండి ఆయా భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పార్క్, డంపింగ్ యార్డ్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్ధన మేరకు లక్షెట్టిపేట గోదావరి నుండి కోటిలింగాల తీరానికి బోటింగ్ ఏర్పాటు కు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా మున్సిపల్ పాలక వర్గం పేర్కొన్నట్లు గోదావరి తీరాన గలా స్మశానవాటికను మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకురావడానికి పరిశీలిస్తామన్నారు. అనంతరం పారిశుధ్యం, ఇతర అంశాలపై స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ ఛైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ వెంకటేష్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.