నడిరోడ్డు పై కరోనా శవాన్ని వదిలివెళ్ళిన 108 సిబ్బంది

0
TMedia (Telugu News) :

మంటకలిసిన మానవీయత

s s consultancy

నడిరోడ్డు పై కరోనా శవాన్ని వదిలివెళ్ళిన 108 సిబ్బంది

టి-మీడియా-తిరువూరు(కృష్ణా జిల్లా):
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల్లోని మానవత్వానికి పెద్ద పరీక్ష పెడుతోంది. అందరూ కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాల్సిన టైంలో కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోతే సాటి మనిషిగా ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోగా, బాధ్యతగా చేయాల్సిన అంత్యక్రియలను కూడా క్రూరంగా తిరస్కరించేస్తున్నారు. తాజాగా, కరోనాతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిన వ్యక్తి మృతదేహాన్ని 108 సిబ్బంది రహదారి పక్కన వదిలేశారు.
ఈ అమానవీయ
సంఘటన కృష్ణా జిల్లా 
తిరువూరు మండలం మునుకుళ్ల సమీపంలో చోటుచేసుకుంది.
పూర్తిగా విచారించగా గ్రామానికి చెందిన షేక్‌ సుభానీ (40) కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వారు చికిత్సకు తీసుకెళుతుండగా మధ్యలో వంతెన సమీపంలో కన్నుమూశారు.
దీంతో 108 సిబ్బంది కుటుంబానికి కనీసం సమాచారం అందించకుండా మృతదేహాన్ని రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు రెండు గంటల పాటు సుభానీ మృతదేహం రోడ్డు పక్కనే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తిరువూరు ఎస్సై సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పోలీసులు, సచివాలయ సిబ్బంది సుభాని మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా, ఈ అమానవీయ ఘటనపై తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘కరోనా బాధితులను 108 వాహనాలు నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ వెళ్లిపోతున్నాయని విమర్శించారు. తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తూ, మధ్యలో చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డు మీదే వదిలేయడం అమానుషం, అనాగరికం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు?’’ అంటూ చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాగా, అంబులెన్సు డ్రైవర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.