తెలంగాణలో లాక్ డౌన్… రేపటి నుండి అమలు

0
TMedia (Telugu News) :

తెలంగాణలో కఠిన లాక్ డౌన్… రేపటి నుండి అమలు

టి-మీడియా/హైదరాబాద్(11):

s s consultancy

*తెలంగాణలో మే 12 నుంచి లాక్ డౌన్.
*రాష్ట్ర కేబినెట్ నిర్ణయం.
*6 నుంచి 10 వరకూ సడలింపు.

సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్న మీమాంస నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పారు. పలుమార్లు ఇదే విషయం స్పష్టత చేస్తూ వచ్చారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయం పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
రాష్ట్రం లో కరోనా విజృంబిస్తన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో
లాక్ డౌన్ విధించారు. దీంతో రేపట్నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ రోజువారీ కార్యకలాపాలకు మినహాయించారు. ఆ తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే, ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా లాక్ డౌన్ ఉండనుంది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయం గురించి గురించి ఇదివరకే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాస్త ఆలస్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్న మీమాంస నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పారు. పలుమార్లు ఇదే విషయం స్పష్టత చేస్తూ వచ్చారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో వ్యాక్సిన్లపైన కూడా చర్చించారు. తెలంగాణలో రెండవ డోసు లబ్దిదారులకు వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి టీకా తయారీకి గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.