కేసీఆర్‌ను ఆదేశించండి.. గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ

0
TMedia (Telugu News) :

కేసీఆర్‌ను ఆదేశించండి.. గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ

టి-మీడియా/హైదరాబాద్(మే-16):

s s consultancy

*కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎంను ఆదేశించండి
*ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా..
*గవర్నర్ తమిళిసైకి బండి సంజయ్ లేఖ.

వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బండి సంజయ్ తమిళసైని కోరారు. కరోనాను నియంత్రించటంలో, వైద్య వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్లే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ పంపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవని కరోనా రోగులకు చికిత్స అంగీకరించడంలేదని. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ప్రైవేటులో చికిత్స కోసం పేదలు ఆస్తులను అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లే ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
‘‘బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదని. ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించి కరోనా చికిత్స అందించేలా ప్రైవేటు హాస్పిటల్ ను ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాదాపు ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని. ప్రధానమంత్రి 30 డిసెంబర్ 2020న ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని చెప్పారని. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని.’’ బండి సంజయ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.