ఆకతాయిలపై లాఠీ జూలిపించిన సీపీ

0
TMedia (Telugu News) :

ఆకతాయిలపై లాఠీ జూలిపించిన సీపీ

ఉల్లంఘన చేసినట్లయితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

s s consultancy

టీమీడియా గోదావరిగని;మే22;

రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ మే 30 తారీఖు వరకు పొడిగించిన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో లాక్ డౌన్ మరియు రాత్రి పూట మరింత కఠినంగా అమలు చేయడంలో భాగంగా ఈరోజు సాయంత్రం గోదావరిఖని, మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలలో బైక్ పెట్రోలింగ్ నిర్వహించి పట్టణంలో జులాయిగా తిరుగుతూ నటువంటి యువకులపై లాఠీ ఝుళిపించడం జరిగింది.వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం మొదట మే 20 వరకు విధించిన లాక్ డౌన్ తర్వాత మరోసారి మే 30 వరకు పొడిగించడం జరిగింది.లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.దానిలో భాగంగా పోలీస్ అధికారులు అందరికీ కఠినమైన లాక్ డౌన్ వాతావరణం ఉండాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కొన్ని ప్రాంతాలలో అనవసరంగా బయట తిరగడం, అనవసరంగా గుంపులు గుంపులుగా ఉండడం వల్లనే కరోనా వ్యాప్తి జరుగుతుంది. రామగుండం కమిషనర్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో ఆకతాయిలు అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై పోలీసులు కొంత బలo ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మానవ మనుగడకు సంబంధించిన విషయం చిన్నచిన్న అవసరాలకోసం బయటకు వచ్చి తిరుగుతాం అంటే ప్రభుత్వం గానీ, అడ్మినిస్ట్రేషన్ గాని, పోలీసులు గాని ఒప్పుకోరు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి అత్యవసర పాసులను కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కొంతమంది మిస్ యూస్ చేయడం జరుగుతుంది.వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తర్వాత వారికి వాహనాలు అప్పగించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ తో కలిసి పని చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.