మద్యం దుకాణాల వద్ద భారీ క్యూ లు

0
TMedia (Telugu News) :
s s consultancy

మద్యం దుకాణాల వద్ద భారీ క్యూ లు

టీ మీడియా మెదక్ నారాయణఖేడ్ *మే 11) : నారాయణఖేడ్ లో మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు బుధవారం నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే మందుబాబులు మత్తు వదిలించుకొని మరి మద్యం దుకాణాల వైపు పరుగులు పెట్టారు. జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. కొన్ని మద్యం షాపుల వద్ద దాదాపు కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరడం గమనార్హం. దీంతో మద్యం షాపుల యజమానులు తమ ప్రైవేటు సిబ్బందితో రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం పోటీ పడటం గమనార్హం. నారాయణఖేడ్, జైరాబాద్, జోగిపేట్, సదాశివ పేట్, పెద్దశంకరంపేట, తడ్కల్, మనూర్,రెగోడ్, మాసన్ పల్లి, జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కూడా మద్యం దుకాణలా వద్ద రద్దీ నెలకొంది..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.