సింగరేణి క్వారంటైన్ సెంటరు అశ్రయం – చికిత్స ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు హర్షం

0
TMedia (Telugu News) :
s s consultancy

సింగరేణి క్వారంటైన్ సెంటరు అశ్రయం – చికిత్స ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు హర్షం.
టి మిడియా, మణుగూరు: మే 29: సింగరేణి ప్రాంతీయ వైద్యశాలలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన మల్లారం కాలనీ లో పనిచేసే ఇద్దరు సింగరేణి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన ఇరువురు పారిశుధ్య కార్మికులు రేగుల గండి గొత్తి కోయలు వారు తిరిగి గ్రామాల్లోకి వెళితే ఆదివాసులు వీరి ద్వారా గ్రామంలో వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రత్యేక కేసుగా పరిగణించి వీరికి సింగరేణి క్వారంటైన్ సెంటర్లో అవకాశం కల్పించాలని దూరంగా ఖాళీగా ఉన్న ఏదైనా ఖాళీ క్వార్టర్ కేటాయించాలని ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్న సమయంలో వారు పోలీసు వాహనం పెట్రోలింగ్ రావడంతో తాము పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న ప్రాంతంలో కాళీగా ఉన్న ఒక క్వార్టర్లో తల దాచుకో గా స్థానికులు గొడవకు దిగటంతో భయపడి వాళ్లు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు రాత్రంతా అడవిలోనే జాగారం చేశారు ,మురికి గుంటలో నీరు తాగి వారు అడవిలో మురికి గుంటల్లో స్థానం చేస్తున్న వీడియో వైరల్ కావడం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో నాయకులు డైరెక్టర్ శ్రీ బలరాం గారికి సివిల్ జియం . చారు గుండ్ల రమేష్ ,ఏరియా జియం, జక్కం రమేష్ కి, సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంతా శ్రీనివాస్ కి సమాచారం ఇవ్వగా స్పందించిన అధికారులు తక్షణమే వారికి సింగరేణి క్వారంటైన్ సెంటర్లో ఉచిత వైద్యం తో పాటు ఆశ్రయం కల్పించాలని ఫోన్ లో స్థానిక సింగరేణి వైద్యులకు ఆదేశాలు జారీ కావడం ఐ ఎఫ్ టి యు, సి ఐ టి యు నాయకులు శనివారం ఉదయం అడవిలో గాలించి వారిని సింగరేణి క్వారంటైన్ సెంటర్ లో చేర్పించారు. ఐ ఎఫ్‌ టి యు, నా సర్ షా సి ఐ టీ యు.ఈశ్వరరావు
లు మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా సింగరేణి స్థాయిలో ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఉందని ప్రత్యేకించి కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తినేపథ్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా వారి బాగోగులు చూసుకునే బాధ్యత స్థానిక అధికారుల పై వైద్యులు పై ఉన్నదని వారిని కష్టకాలంలో అనాధలని చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మంగీలాల్, హతి రామ్, భీమరాజు నరసింహారావు, నాగేశ్వరరావు, సమ్మయ్య, రంగయ్య,ఇమాంబి, సీత ,ఉపేంద్ర పలువురు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.