నెటిజన్ల ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్….బ్లాక్ ఫంగస్ బాధితునికి సాయం

0
TMedia (Telugu News) :

నెటిజన్ల ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్….బ్లాక్ ఫంగస్ బాధితునికి సాయం
టి-మీడియా/హైదరాబాద్(16):

s s consultancy

*బ్లాక్‌ ఫంగస్‌తో శనివారం ఇద్దరు మృతి.
*బ్లాక్ ఫంగస్ బెడ్ కావాలని ట్వీట్ చేసిన యువతి.
*నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన కేటీఆర్.
తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌ కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న పలువురు రోగులు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నారు. బ్లాక్‌ ఫంగ్‌సతో శనివారం మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన స్వామి గౌడ్‌ (38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్ర వ్యాపారి రాం కిషన్‌ (60) బ్లాక్‌ ఫంగ్‌సతో చనిపోయాడు. ఇతడికి మధుమేహంతో పాటు ఇతర సమస్యలున్నాయి. హైదరాబాద్‌ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలుండటంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.
ఇలా వరుసగా కరోనాతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు సైతం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌కు ఓ యువతి బ్లాక్ ఫంగస్ విషయంలో ఓ రిక్వెస్ట్ పెట్టింది. ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. ‘బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న నా స్నేహితురాలు తండ్రికి బెడ్ అవసరమని సహాయం చేయవలసిందిగా కోరారు. దీనికి చికిత్స అందుబాటులో ఉన్న కేంద్రాలు ఏమైనా ఉన్నాయా నాకు తెలియజేయండి’ అంటూ కేటీఆర్‌ను కోరింది. దీంతో యువతి చేసిన ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్ ‘అతన్ని ఇ.యన్.టి. ఆసుపత్రిలో చేర్పించవచ్చు దయచేసి సహాయం చేయండి అంటూ కేటీఆర్‌ ఆఫీస్‌కు సూచించారు. కేటీఆర్ ఆఫీస్ కూడా వెంటనే దీనిపై స్పందించి నోటడ్ సార్ అని రిప్లై ఇచ్చింది. ఇంతే కాకుండా ఇదే సమయంలో పలువురు నెటిజన్ల అవసరాలకు తగ్గట్టు కేటీఆర్‌ సలహాలు, సూచనలుచేసి సాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.